Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ఆచార్య'. అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతోపాటు కొరటాల శివ మార్క్ సందేశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి గెటప్ ఎలా ఉంటుంది?, ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఎలా ఉంటుందనే ప్రశ్నలకు సమాధానం దాదాపు దొరికేసినట్టే.
ఎందుకంటే ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శ్రీరామనవమి కానుకగా గురువారం రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన చిరు అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇదిలా ఉంటే, కరోనా ఎఫెక్ట్ వల్ల శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తున్న విషయం విదితమే. గతంలో వీరిద్దరూ 'ఖైదీ నెం.150' చిత్రంలో నటించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన విషయం విదితమే. మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉందట.