Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిత్య క్రియేషన్స్ పతాకం పై లక్ష్మీ శ్రీవాత్సవ స్వీయ నిర్మాణంలో కష్ణంరాజు దర్శకునిగా తెరకెక్కిన సినిమా 'గుండమ్మ కథ'. 'ఈ చిత్రంలో ఆదిత్య హీరోగా, ప్రణవ్య హీరోయిన్గా నటిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి లక్ష్మీ శ్రీవాత్సవ ఓ వైపున నిర్మాతగా నిర్మాణ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. అలాగే కష్ణంరాజుతో కలిసి దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. అలనాటి 'గుండమ్మ కథ' ఏ రేంజ్లో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసిందో అదే రేంజ్లో ఈతరం ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే రీతిలో లవ్, కామెడీ, సెంటిమెంట్ తదితర అంశాలతో తెరకెక్కించారు' అని చిత్ర బందం తెలిపింది.
'అలనాటి గుండమ్మ కథ తరతరాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల్ని ఏ రీతిన అలరిస్తుందో అదే స్పూర్తితో, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఈ మోడ్రన్ గుండమ్మ కథని రెడీ చేశాం. ఈ సినిమాలో ఆదిత్య, ప్రణవ్య జంటగా నటిస్తున్నారు. జబర్థస్థ్ ఫేమ్ గెటెప్ శ్రీను కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. ఫ్యామిలీతో హాయిగా చూసే సినిమాగా ఈ సినిమా ఉండబోతుంది. థియేటర్స్ లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని నిర్మాత, దర్శకులు లక్ష్మీ శ్రీవాత్సవ, కష్ణంరాజులు చెప్పారు. ఈచిత్రానికి కెమెరా - మోనీష్ భూపతి, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, మ్యూజిక్ - సతీష్ సాధన్, కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే - లక్ష్మీ శ్రీవాత్సవ, నిర్మాత - లక్ష్మీ శ్రీవాత్సవ, దర్శకత్వం - లక్ష్మీ శ్రీవాత్సవ, కష్ణం రాజు.