Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్లో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం 'కార్తికేయ'. వీరిద్దరి కాంబినేషన్లోనే ఈ చిత్ర సీక్వెల్ కూడా తెరకెక్కనుంది. 'కార్తికేయ 2' టైటిల్‌తో రెడీ అవుతున్న ఈ సినిమాలో డాక్టర్‌గా నిఖిల్ నటిస్తున్నారు. 'కార్తికేయ'లో మెడికల్ స్టూడెంట్‌గా నటించిన నిఖిల్ ఇప్పుడు ఈ సీక్వెల్లో డాక్టర్‌గా కనిపించబోతున్నారనే విషయాన్ని కార్తికేయ 2 చిత్ర బందం చెప్పకనే చెప్పేసారు. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా 'కార్తికేయ 2' చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. ఈ లుక్‌లో నిఖిల్ మెడలో స్టెతప్ స్కోప్ ఉంది. అలాగే 'వైద్యో నారాయణో హరి - వైద్యుడే నారాయణుడు - నారాయణుడే వైద్యుడు' అని ఒక శ్లోకాన్ని, దాని అర్థాన్ని కూడా ఈ పోస్టర్లో పెట్టారు. ఇదే పోస్టర్లో కరోనాతో యుద్ధం చేస్తున్న వైద్యులకు కూడా కతజ్ఞతలు డైరెక్టర్ చందు మొండేటితోపాటు చిత్ర బందం కృతజ్ఞతలు తెలిపారు.