Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై మధురా శ్రీధర్ రెడ్డి సమర్పణలో రూపొందిన చిత్రం 'లవ్ లైఫ్ అండ్ పకోడి'. జయంత్ గాలి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్‌కి సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. కార్తిక్, సంచిత హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ లుక్‌లో వీరి ఫొజులు రోటీన్ లుక్స్ భిన్నంగా ఉంటూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత జయంత్ గాలి మాట్లాడుతూ, 'ఈ జనరేషన్లో ఏ రిలేషన్‌కి అయినా కమిట్ అవడానికి భయపడతారు. కన్ఫ్యూజ్ అవుతారు. కరెక్టా కాదా అనే సందేహాలలో పడిపోతారు.వారి మధ్య ఆకర్షణలు, ప్రేమలు ఉంటాయి. కానీ వారి బాండింగ్‌కి ఎలాంటి రిలేషన్‌ని ముడి పెట్టడానికి ఇష్టపడరు. అదే మా ప్రేమ కథ. మోడ్రన్ కల్చర్‌లో నేటి జనరేషన్ లివింగ్ స్టయిల్ని ప్రతిబింబించే ఈ కథ తప్పకుండా యూత్‌కి కనెక్ట్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది. లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యాయి. థియేటర్స్‌కి అనుమతులు లభించగానే రిలీజ్‌కి ప్లాన్ చేసుకుంటాం' అని చెప్పారు.