Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా జీవితంలో నేనెప్పుడూ సల్మాన్‌ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటానని అస్సలు ఊహించలేదు. అలాంటి ఊహించని సందర్భం నా లైఫ్‌లో నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. సహ నటీనటులతో సల్మాన్ వ్యవహరించే తీరూ చాలా గొప్పగా ఉంది' అని అంటోంది మేఘా ఆకాష్.
'లై', 'ఛల్ మోహన్ రంగ' చిత్రాల్లో నితిన్ సరసన రెండు మెరిసిన మేఘా ఆ తర్వాత పలు తమిళ సినిమాల్లో నటిస్తూ తెలుగు తెరకు దూరమైంది. తమిళనాట మంచి మంచి ఆఫర్లను అందుకుంటు అగ్ర కథానాయకుల సరసన నటించిన మేఘా లేటెస్ట్గా ఓ బంపర్ ఆఫర్‌ని దక్కించుకుంది. సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాథే' సినిమాలో మేఘా నటిస్తోంది. అయితే అందరూ అనుకుంటున్నట్టు సల్మాన్ ప్రియురాలిగా మేఘా నటించడం లేదట. కానీ చాలా కీలక పాత్రను పోషిస్తున్నట్టు మేఘా తెలిపింది. అలాగే షఉటింగ్ తొలిరోజే సల్మాన్ నిర్వహిస్తున్న బీయింగ్ హ్యుమన్ సంస్థ టీ షర్ట్స్‌ని బహుమతిగా సల్మాన్ ఇవ్వడం ఆనందాన్నిచ్చిందని మేఘా తెలిపింది.