Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''వాళ్లు ప్రాణం పోసే దేవుళ్ళు... వాళ్లు దేశానికి ఆక్సిజన్ ఇచ్చే ప్రాణ దాతలు... మెడికల్ కళాశాలలు ప్రాణం పోసే విద్యార్థులను తయారు చేసే దేవాలయాలు అనుకుంటాం. ఇది నాణేనికి ఒకవైపే. కొన్ని మెడికల్ కళాశాలలో కొందరు ప్రొఫెసర్లు విద్యార్థుల పట్ల చేస్తున్న ఆగడాలు. వికృత చేష్టలు సభ్య సమాజానికి తలమానికంగా చెప్పుకో వచ్చు. ఇటీవల కాలంలో కొన్ని ప్రయివేట్, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్ల వేధింపులకు, ఛీత్కారాలకు ఎంతోమంది విద్యార్థులు బలవుతున్న సంఘటనలు డా. ప్రీతి ఉదాంతాన్ని ఉదాహరణగా చెప్పు కోవచ్చు. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి, తమ పిల్లలను డాక్టర్లు చేయాలని కళాశాలకు పంపితే విద్యార్థులకు చదువు చెప్పమని అటు ప్రభుత్వం, ప్రయివేట్ యాజమాన్యం లక్షలాది రూపాయలు ఇచ్చి ప్రొఫెసర్లకు గైడ్ చేస్తే, తరగతి గదిలో విద్యార్థుల పట్ల కొందరు ప్రొఫెసర్ల దురహంకారం, కుల వివక్షత చూపిస్తున్న సంఘటనలు ఎన్నో కనిపి స్తాయి. ఏ లోకానికి తెలియని, ఏ విద్యార్థి చెప్పుకోలేని, ఆగడాలు... అవమానాలు. ఛీత్కారాలు అంతా ఇంతా కాదు. అటు ర్యాగింగ్ భూతం, ఇటుకొందరు ప్రొఫెసర్ల ఆగడాలకు 119 మెడికోలు సూసైడ్ చేసుకున్నట్లు ఐదు సంవత్సరాల లెక్కలు చెబుతున్నాయి. తల్లిదండ్రులు అష్టకష్టాలు పడి లక్షలాది రూపాయలు వెచ్చించి తమ బిడ్డలను మంచి వైద్య విద్యార్థులుగా కావాలని చదువుకోవడానికి పంపితే కళాశాలలో ఈ రకమైనటువంటి ఆగడాలు జరుగతుండడం శోచనీయం. ఎంతో మంది విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్న సంఘటనలు అటు యాజమాన్యం దృష్టికి గాని, ఇటు ప్రభుత్వం దృష్టికి పత్రిక వ్యవస్థకు కూడా తీసుకువెళ్ళకపోవడం బాధాకరం. విద్యార్థులు చెప్పుకోలేని బాధ లతో విలపిస్తూ ఉన్నారు. ఎదురు తిరిగితే ఫెయిల్ చేస్తారని, ప్రశ్నిస్తే భవిష్యత్తు భుగ్గిపాలుచేస్తారని మెడికోలు భయాం దోళనతో కాలం వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం కఠిన చట్టాల అమలు చేస్తూ ఆయా కళాశాలలో జరుగుతున్న ఆగడా లను అదుపు చేయాల్సి అవసరం ఉంది. కొందరు ప్రొఫెసర్లు కావచ్చు, ఇటు మరికొందరు విద్యార్థులు చేస్తున్న వికృతి చేష్టలు గమనించి, ఒక స్వచ్ఛంద సంస్థ లేక, ఉన్నతస్థాయిలో ఎంక్వైరీ చేస్తె మరెంతో మంది జీవితాలు కాపాడవచ్చు. అందుకే ఆరుద్ర అంటాడు... ''మన స్వాతంత్య్రం మేడిపండు... మన దారిద్య్రం రాచపుండని. ''కానీ నేనంటాను'' మన కులవివక్షత... కుల దరహంకారం రాచపుం డని'' పదండి చూద్దాం ఆయా మెడికల్ కళాశాలలో జరుగుతున్న కులదురహంకార సైకో ప్రొఫెసర్ల ఆగడాలను..!! వారికి కన్న బిడ్డలు ఉన్నారుగా, వారుఎంతో ఉన్నత వైద్య విద్యను అభ్యసించిన మేధావులేగా, నీతి, నైతిక ధర్మాలు, మానవీయ నియ మాలు ఉన్నాయి. మరి ఎందుకు ఇంత వికృత చేష్టాలు? మరి ఎందుకు ఇంత నీచపు కుట్రలు? విజ్ఞతతో ఆలోచించండి... వారు సాటి మానవు లేగా..!? మానవ త్వంతో ఆలోచిం చండి. ప్రాణాలు కాపాడే వారికి ఇది తగునా?
(డా.ప్రీతి మృతికి నివాళులు)
-ఎం. కార్తీక్