Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్నేండ్ల క్రితం రాజమండ్రి పట్టణంలో కొంత మంది కులాన్ని కాల్చివేయాలంటే ఏం చేయాలని మేథోమథనం చేశారట. అంటరానితనం బుసలు కొడుతున్నది. కులవివక్ష రాజ్యమేలుతున్నది. ఆ పరిస్థితులను మార్చాలి. విద్యార్థులు, యువత, ప్రజల్లో కులవివక్షపై చైతన్యం పెంచాలి. అందుకు నడుం బిగించాలి. అను కున్నారట. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, ఆయా ముఖ్యమైన కేంద్రాల్లో కమిటీలు వేేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఆ కమిటీలు బాధ్యత తీసుకుని కులరాకాసిని అంతం చేయాలని తెగ లెక్చర్లు ఇచ్చారట. పొద్దున్నే అనుకున్న నిర్ణయాలను అమలు చేయాలంటూ హుకుం జారీ చేశారట. అందరూ గంగిరెద్దులా తలూ పారట. క్షేత్రస్థాయిలో కమిటీల ఏర్పాటుకు ముందుగా పట్టణస్థాయిలో కమిటీ వేయాలని అనుకున్నారట. రేపు పొద్దున్నే పలానా చోట కలుసుకుందాం అనుకుని వెళ్లిపోయారట. అనుకున్న సమయానికి అందరూ గుమిగూడారట. చర్చలు ప్రారంభమయ్యాయి. కార్యదర్శిగా ఎవరూ ఉండాలనేదానిపై చర్చ ప్రారంభమైందట. దీనిపై చర్చోపచర్చలు జరిగాయట. మిగతా పోస్టులకు పేర్లు రాశారట. కానీ కార్యదర్శి పోస్టుకు ఒక వ్యక్తి పోటీ పడ్డాడు. కానీ ఆయనకు ఇవ్వడం మిగతా సభ్యులకు ఇష్టం లేదు. అయినా ఆ పోస్టు కోసం పట్టువిడవకుండా మొండికేశాడట. చివరకు ఆయనకు కార్యదర్శి పోస్టు దక్కలేదు. దీంతో వారి లక్ష్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. కమిటీలు లేవు, చైతన్యం లేదు. ఇప్పుడు ఆయన్ను ఇదే అంశంపై అడిగితే, ఆనాడు నాకు కార్యదర్శి పోస్టు ఇస్తే కులవివక్ష, అంటరానితనం ఉండేది కాదంటున్నారు. నాకు ఆపోస్టు ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికి కుల జాఢ్యం పోలేదని నవ్వుతూ ఆటపట్టిస్తున్నారు. దటీజ్ మనువాదుల మైండ్సెట్.
- గుడిగ రఘు