Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బండీ చల్ తొండీ. ప్రజల మనిషిని అంటివి. ప్రజల కోసం పోరాడుతున్నంటివి. ఓ గొప్పాలు కొడితివి. ఏంటీ అప్పుడే ప్లేట్ ఫిరాయించేశావ్. 'ప్రజల కోసం పనిచేసేటోడ్నీ కాదు నేను..పార్టీ కోసం పనిచేసేటోడ్నీ. నేను అనుకుంటే పదవి రాలేదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నా బిస్తర్ రడీగా ఉంటది' అంటూ తనలోని నిజస్వరూపాన్ని కక్కేశాడు. అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు కవితపై మాటలు తూలితివి మహిళా కమిషన్ చేతిలో అడ్డంగా బుక్కయితివి. 'గీ మాటలు నేను అనలేదు' అని తొండి చేయడంలోనూ బండి సిద్ధహస్తుడే రేపొద్దుగాల ఏమైనా చేయొచ్చు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే.. వర్షాలకు బైకుపోతే బైకు..కారుపోతే కారు కోనిస్తమంటివి. గిదెట్ల సాధ్యమైతదని మీడియావాళ్లు అడిగితే 'బండ్లకు ఇన్సూరెన్స్ ఉంటదిగా అవి ఇప్పిస్తం' అని నవ్వులపాలైతివి. గీదానికి గీయన కావాల్నా అని అప్పట్లో పెద్ద సెటైర్లే సోషల్మీడియా సాక్షిగా పేలాయి. హే చల్ తొండి పోరగాండ్లు ముగ్గురు పోతే ఇష్టమొచ్చినట్టు చలాన్లు వేస్తరా? రద్దు చేపిస్తమంటివి?. ఆశపడ్డ పోరగాండ్లు సార్ చలాన్లు రద్దు ఏమైంది అని అడిగితే నెత్తి గోక్కుంటివి. సారూ మీరు రాష్ట్రంలో ఓ పార్టీకి అధ్యక్షులు. మాట్లాడేటప్పుడు జర ఎన్కముందు చూస్కొని మాట్లాడు లేకుంటే నలుగురిలో నవ్వులపాలైతవ్.
- అచ్చిన ప్రశాంత్