Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంతిని గోడకు ఎంత గట్టిగా విసిరితే... అంతే వేగంగా వెనక్కి వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఆమె ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ తిరిగి తెలంగాణకు వస్తారో లేదో అనే డౌటనుమానం వెంటాడుతూనే ఉంది. అదిగో అరెస్టు..ఇదిగో అరెస్టు అంటూ సోషల్ మీడియా చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. టీవీల్లో కవితక్క లోపలికెళ్లి, బయటకు వచ్చే వరకు చర్చలపై చర్చలు నిర్వహిస్తూ, ఈ పూటకు 'ఐటం' దొరికిందని సంబరపడిపోతున్నాయి. కవిత విషయంలో బీజేపీపై నిప్పులు చెరుగుతున్న బీఆర్ఎస్ రాష్ట్రంలో గురివింద చందంగానే వ్యవహరిస్తున్నది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. 'మీరు సర్కారుపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు మాకివ్వండి' అని కోరింది. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి అచ్చం ఢిల్లీలో కవిత చేస్తున్న హడావిడి మాదిరే హైదరాబాద్ సిట్ ఆఫీసు దగ్గరా చేశారు. వందలాదిమంది కార్యకర్తల్ని వెంటేసుకొని పోలీస్ కంట్రోల్ రూం దగ్గరకు వెళ్లారు. ఢిల్లీలో కవిత హడావిడికి, హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి హడావిడికీ పెద్ద తేడా ఏం కనిపించలేదు. అదేదో అంటారు కదా...ఆవు చేలో మేస్తే దూడ....అని...అచ్చం అలాగే లేదూ సీన్!!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి