Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ కొరియా రైతుల కో- ఆపరేటివ్ నిర్ణయం
సియోల్ : నగదు బదిలీలపై విధించిన ఆంక్షలు అధిగమించేందుకు ఉత్తరకొరియాకు అండగా దక్షిణ కొరియా రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర కొరియా నుంచి లిక్కర్, ఆహార ఉత్పత్తులకు చక్కెరను మార్పిడి చేసుకునే 15 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సౌత్ కొరియా ఫార్మర్స్ కోపరేటివ్ గురువారం పేర్కొంది. చైనాకు చెందిన ఒక కంపెనీ మధ్యవర్తిత్వం వహించిన ఈ ఒప్పందంపై ఉత్తర కొరియాకు చెందిన ఐదు వాణిజ్య సంస్థలతో సంతకాలు జరిగాయని కోపరేటివ్కు చెందిన అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ ఒప్పందానికి సంబంధించి అంతర్గత కొరియా వ్యవహారాలను పర్యవేక్షించే సియెల్ యూనిఫికేషన్ మినిస్ట్రీ నుంచి ఆమోదం రావాల్సి ఉందని అన్నారు. నిబంధనల ప్రకారం దక్షిణ కొరియా నుంచి 167 టన్నుల చక్కెర కోసం ఉత్తర కొరియా బ్లూబెర్రీ లిక్కర్, క్రాకర్లు, క్యాండీలు వంటి 240 ఉత్పత్తులను మార్పడి చేయనుందని తెలిపారు.