Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిక్‌టాక్ యాజమాన్యం వెల్లడి
వాషింగ్టన్ : ఆధునిక బందిపోటులా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ చర్యపై న్యాయపోరాటానికి టిక్‌టాక్ యాజమాన్యం సిద్ధమవుతోంది. 45 రోజుల తర్వాత టిక్‌టాక్ యాజమాన్యం చైనాకు చెందిన బైట్ డ్యాన్సతో అన్ని ఒప్పందాలను బ్లాక్ చేసేందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆయన గురువారం సంతకం చేశారు. అమెరికాలో ఈ పాపులర్ వీడియో షేరింగ్ యాప్‌తో ఒక డీల్‌ను కుదుర్చుకునేందుకు మైక్రోసాఫ్ట్ చర్యలు జరుపుతున్న సమయంలోనే ఈ ఉత్తర్వులు విడుదల కావడం గమనార్హం. ఈ చర్య ద్వారా ట్రంప్ తనకు తాను ఆధునిక బందిపోటునని ప్రకటించుకున్నట్లు అయిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే సమయంలో చైనాకు చెందిన మెసేజింగ్ యాప్ విరుచాట్ ఆపరేటర్ టెన్సెంట్తో కూడా 45 రోజుల తర్వాత లేదా సెప్టెంబర్ 20 నుంచి ఒప్పందాలపై నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్ మూడు రోజుల క్రితం కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్వర్వులను కోర్టులో సవాల్ చేయాలని టిక్‌టాక్ యాజమాన్యం నిర్ణయించింది. అమెరికా ప్రభుత్వం ప్రయివేటు సంస్థల మధ్య జరిగే చర్చల్లోను జోక్యం చేసుకుంటోందని టిక్‌టాక్ విమర్శించింది.