Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాన్ఫ్రాన్సిస్కో : చైనాకు చెందిన మెసేజింగ్, సోషల్ మీడియా, మొబైల్ పేమెంట్ యాప్ వియ్ చాట్‌పై ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన మేజిస్ట్రేట్ జడ్జి లౌరెల్ బీలర్ తాత్కాలికంగా అడ్డుకున్నారు. వరుసగా మూడు రోజుల పాటు విచారణ చేసిన ఆయన ఈ మేరకు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి నుంచే అమల్లోకి వస్తాయని చెప్పారు. వియ్ చాట్‌పై విధించిన ఆంక్షలు అమెరికాలోని యాప్ వినియోగదారుల రాజ్యాంగపరమైన సవరణ హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. అమెరికాలో ప్రధానంగా చైనీస్ మాట్లాడే లేదా చైనీస్-అమెరికన్ సమాజంలోని వినియోగదారులకు వియ్ చాట్‌ను మరేదీ పూడ్చలేదని అమెరికా వియ్ చాట్ యూజర్స అలయన్స(యూఎస్డబ్యూఏ)తో పాటు ఇతర యాప్‌ల వినియోగదారులతో కూడిన ఇతర వాదులు తమ వాదన కోర్టుకు తెలిపారు. వియ్ చాట్ దవ్వారా అమెరికా చేసే ట్రాన్సాక్షన్లపై నిషేధం విధిస్తూ ట్రంప్ ఆగస్టు 6న కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నిషేధం ఈనెల 20 ఆర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.