Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అంతర్జాతీయ విద్యార్ధులు, పర్యాటకులు, విదేశీ సమాచార మీడియా ప్రతినిధులకు అమెరికాలో నిర్దిష్ట కాలం మాత్రమే వుండేలా ఒక నిబంధన తీసుకురావాలని ప్రతిపాది స్తున్నట్లు గురువారం అమెరికా హౌంల్యాండ్ భద్రతా (డిహెచ్ ఎస్) విభాగం ప్రకటించింది. అడ్మిషన్ నిబంధనలకు అనుగు ణంగా వ్యవహరించినంత కాలమూ అమెరికాలోనే వుండేందుకు ప్రస్తుతం ఎఫ్, జె, ఐ క్లాసిఫికేషన్లను అనుమతించే స్టేటస్ ఫ్రేమ్‌వర్క్ కాలపరిమితిని తొలగించాలని కొత్త నిబంధన ప్రతిపాదిస్తోంది. ఈ నిబంధన కింద, అధికారికంగా వుండేందుకు పరిమితి రెండేళ్ళు మాత్రమేనని డిహెచ్ఎస్ నిర్ణయించకపోయిన పక్షంలో ఎఫ్ లేదా జె కేటగిరీకి చెందిన నాన్ ఇమ్మిగ్రెంట్లు తమ కార్యక్రమం చివరి వరకు అమెరికాలో వుండడానికి అనుమతి స్తారు. అయితే అది నాలుగేళ్ళు దాటరాదు. హై వీసా ఓవర్‌స్టే రేట్లు కలిగిన ప్రాంతాల నుండి వచ్చిన వారికి రెండేళ్ళపాటు వుం డేందుకు అనుమతిస్తారు. ఇక, విదేశీ సమాచార మీడియా ప్రతి నిధులకు తమ కార్యకలాపాలు ముగియడానికి అవసరమైన కాల పరిమితి వుంటుందని డిహెచ్ఎస్ పేర్కొంది. అయితే 240 రోజులు దాటరాదని సూచించింది. అయితే సంబంధిత కార్యకలా పాల విస్తృతిని బట్టి మరో 240 రోజులు పొడిగించుకోవచ్చునని పేర్కొంది. ఎఫ్ కేటగిరీ నాన్ ఇమ్మిగ్రెంట్ల కాలపరిమితిని 60 నుండి 30రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. ప్రతిపాదిత మార్పులపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఫెడరల్ రిజిస్టర్లో వీటిని ప్రచురించనున్నారు.