Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లా మార్సా : మొదటి ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన ఫ్రెంచ్ జలాంతర్గామి అరియానెను ట్యునీషియా డైవర్లు కనుగొన్నారు. 1017లో జర్మన్ జలాంతర్గామి దీన్ని ముంచివేసింది. దేశంలోని ఈశాన్య ప్రాంతంలో గల డైవింగ్ క్లబ్ మేనేజర్లు దీన్ని కనుగొన్నారు. తమ విద్యార్ధులతో కలిసి వారు కొత్త ప్రాంతాలను అన్వేషిస్తుండగా ఇది కనిపించింది. మొదట అవేవో శిధిలాలని అనుకున్నాం, చెక్కుచెదరకుండా వున్న ఈ శిథిóల జలాంతర్గామి పూర్తిగా నాచు పట్టేసి వుంది. చేపలు, ఇతర జీవజాలానికి ఇది నిలయంగా మారింది. నిపుణులను సంప్రదించిన తర్వాత దీన్ని అరియానె జలాంతర్గామిగా గుర్తించారు. ఉత్తర ట్యునీషియాలోని ఫ్రెంచి ఓడరేవులో ఇది వుండేది. మధ్యధరా సముద్రంలో ఆ యుద్ధ సమయంలో ఏం జరిగిందో ప్రతిదీ వివరంగా తెలుసుకుంటున్నామని రాస్ అడర్ క్లబ్ డైవింగ్ డైరెక్టర్ సెలిమ్ బాసర్ చెప్పారు. ఉపరితలం మీద వుంటుండగానే అరియానెను జర్మనీ జలాంతర్గామి ముంచివేసింది. ఆ ఘటనలో మొత్తంగా 29మంది సిబ్బందికి గాను 8మందే బతికారు. మొదటి ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన జలాంతర్గామి బయటపడడం అద్భుతమేనని ఫ్రెంచి మాజీ జలాంతర్గామి ఆపరేటర్ల సమాఖ్య అధ్యక్షుడు అడ్మిరల్ డొమినిక్ సేలాస్ వ్యాఖ్యానించారు.