Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెనీవా : శనివారం ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 లక్షల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈ విష యాన్ని తెలిపింది. శనివారం 3,92,471 కొత్త కేసులు వెలుగుచూశాయని, మహమ్మారి ప్రారంభమయ్యాక ఒక్క రోజు కొత్త కేసుల విషయంలో ఇదే అత్యధకమని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 3,91,96,259కు చేరుకుంది. శనివారం ఒక రోజు కేసుల విషయంలో అమెరికాలో అత్యధికంగా 63,044 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 78,96,895గా ఉంది. శనివారం ఒక్కరోజులో భారత్లో 62, 212 నమోదయ్యాయి. దీంతో భారత్లో మొత్తం కేసుల సంఖ్య 75 లక్షలకు చేరువలో ఉంది. శనివారం నాటికి కరోనాతో మరణించినవారి సంఖ్య 11,01,298కు చేరుకుంది.