Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : అమెరికాలోని ఓ రెస్టారెంట్ తమ కుటుంబం పట్ల జాత్యహంకారంతో ప్రవర్తించిందని, బయటికి గెంటేసిందని గాయని, నటి అయిన అనన్యాబిర్లా మండిపడ్డారు. తమ కుటుంబాన్ని కాలిఫోర్నియాలోని ఇటాలియన్- అమెరికన్ రెస్టారెంట్ అయిన 'స్కోపా నుంచి వెళ్లగొట్టారని, ఈ ఘటన శనివారం జరిగిందని ట్విట్టర్లో తెలిపారు. స్కోపా రెస్టారెంట్ జాతివివక్షతో తమతో అనుచితంగా ప్రవర్తించిందని, ఇది విచారకరమని, అతిథుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని, ఇది సరైన పద్ధతి కాదని అనన్య ట్వీట్ చేశారు. రెస్టారెంట్లో భోజనం కోసం తాము 3 గంటలు వేచి చూశామని, వెయిటర్ సిల్వర్మాన్ తన తల్లితో దురుసుగా ప్రవర్తించారని, జాతివివక్ష వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కాగా, అనన్యా బిర్లా బిలియనీర్, ఆదిత్యబిర్లా గ్రూప్స్ చైర్మెన్ కుమార్మంగలమ్ బిర్లా, విద్యావేత్త, మానసిక ఆరోగ్య కార్యకర్త నీర్జా బిర్లాల కుమార్తె. రెస్టారెంట్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించిందని, స్కోపా రెస్టారెంట్ తీరు షాకింగ్‌కు గురిచేసిందని, అతిథుల పట్ల ఇలా వ్యవహరించే హక్కు వారికి లేదంటూ.. రెస్టారెంట్ తీరును నీర్జా బిర్లా, ఆమె కుమారుడు ఆర్యమాన్ బిర్లా ఖండించారు. గతంలో తమకు ఎన్నడూ ఇటువంటి జాతి రాసిస్ట్ ఘటనలు ఎదురు కాలేదని, జాతివివక్ష ఉందన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామని ఆర్యమాన్ అన్నారు.