Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: యూరప్ లో కోవిడ్ ఉధృతి తగ్గడంలేదు. రోజురోజుకీ మరణాల సంఖ్య పెరుగుతోంది. శనివారం ఉదయం ఏఎఫ్పి విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం నాలుగు లక్షలకు పైగా కోవిడ్ మరణాలు సంభవించాయి. లాటిన్ అమెరికా, కరేబియన్ తర్వాత అత్యధిక మరణాలతో యూరప్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు యూరప్‌లో 1,76,06,370 పాజిటిక్ కేసులు నమోదు కాగా 4,00,649 మంది కోవిడ్‌తో మరణించారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి అత్యధికంగా 36,147 మరణాలు గత వారంలోనే సంభవించాయి. యూరప్‌లోని మరణాలతో పోల్చితే 57,551 మంది బ్రిటన్‌లో వైరస్ భారిన పడి మృత్యువాత పడ్డారు. 1.60 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 1.50లక్షల మంది పాజిటివ్ భారిన పడగా 53,677 మంది మృతిచెందారు. ఫ్రాన్స్‌లో 2.20లక్షల పాజిటివ్ కేసుల్లో 51,914 మంది మరణాలు సంభవించాయి. స్పెయిన్‌లో 1.60 లక్షల కేసులు నమోదుకాగా 44,668 మంది మృత్యువాతపడ్డారు. రష్యాలో 2.20లక్షల మందికి కోవిడ్ సోకగా 39,068 మంది మరణించారు.