Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిబెట్ బిల్లుపై సంతకం..
- దలైలామా వారసుడి ఎన్నుకునేది వారే !
న్యూయార్క్: పదవీకాలం ముగియడానికి దగ్గరపడుతు న్నప్ప టికీ.. చైనా వ్యవహారాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలదూర్చడం ఆగలేదు. టిబెట్ దలైలామా వారసుడి ఎంపికలో చైనా ప్రమేయం లేకుండా ఉండేందుకు 'టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్-2020' బిల్లును తీసుకు వచ్చిన అమెరికా చట్టసభలు.. దలైలామా వారసుడి ఎంపికలో చైనా ఎలాంటి జోక్యం చేసుకున్నా తాము సహించబోమనీ, చైనాపై తీవ్ర ఆంక్షలు విధించడానికి సైతం వెనుకాడబోమని హెచ్చరిస్తూ.. ఆ బిల్లుకు ఆమోదం తెలిపాయి. తాజా గా ఈ బిల్లుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. తాజా బిల్లుతో టిబ ెట్లో అమెరికా రాయబార కార్యాలయం ఏర్పాటు చేయ నున్నారు. టిబె ట్ అంశంపై అమెరికా తీసుకుంటున్న చర్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. టిబెట్ బిల్లు అంశంపై యూఎస్ చట్టసభల్లో చర్చకు వచ్చిన నేపథ్యంలో.. తమ అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చకూడదనీ, దీనిపై ట్రంప్ సంతకం చేయకూడదని ఇదివరకే హెచ్చరించింది. చైనా ఈ చ ట్టాన్ని తిరస్కరించిందనీ, అమెరికా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలకు హాని కలిగించకుండా ఉండాలని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.