Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైడెన్‌కు తొలి వైఫల్యం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం మొట్టమొదటి కేబినెట్ ఓటమిని ఎదుర్కొన్నారు. వైట్‌హౌస్ బడ్జెట్ డైరెక్టర్‌గా ఇండియన్ అమెరికన్ నీరా టాండన్ పేరును తొలుత ప్రతిపాదించినప్పటికీ స్వంత పార్టీ నుండే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో బైడెన్‌కి వెనక్కి తగ్గక తప్పలేదు. గతంలో డెమోక్రాట్లను విమర్శిస్తూ ఆమె చేసిన పలు ట్వీట్లే ఇప్పుడు ఆమె పదవికి చేటు తెచ్చి పెట్టాయి. ఈ నేపథ్యంలో తన నామినేషన్‌పై చర్చ జరగాలని తాను కోరుకోవడం లేదని, అందుకనే నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్లు ఆమె ఒక లేఖ రాశారు. దానిపై బైడెన్ స్పందిస్తూ, తక్షణమే ఆమె అభ్యర్ధనను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు బైడెన్ నియామకాలన్నింటికీ పూర్తి స్థాయిలో మద్దతు లభించింది. ఇంకా మరో రెండు నియామకాలకు ధృవీకరణ పొందాల్సి వుంది. ఆర్థిక సలహాదారుల మండలి ఛైర్మన్‌గా మొట్టమొదటి నల్ల జాతీయుడు సిసీలియా రౌజ్, వాణిజ్య శాఖ మంత్రి గినా రైమండోల నియామకాలను సెనెట్ ధృవీకరించాల్సి వుంది. టాండన్ విషయంలో తగిలిన ఎదురుదెబ్బతో మోడరేట్ల చేతుల్లో గణనీయమైన రాజకీయాధికారం వుందన్న భావనకు గుర్తింపు పెరిగింది.