Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: చైనాలో కొన్ని అరుదైన లోహాలు ఉన్నాయి. ఈ లోహాలు విద్యుత్‌తో నడిచే వాహనాలు, గాలి మరలు, డ్రోన్స్ తయారికి కీలకమైనవి. 2019లో అమెరికాకు అవసరమైన అరుదైన లోహాలు 80 శాతం, యూరోపియన్ యూనియన్‌కు అవసరమైనవి 98 శాతం చైనా నుంచే దిగుమతి చేసుకున్నారు. అదే చైనా వాటిని ఇవ్వని పక్షంలో పర్యావరణ హితమైన వాహనాలను అమెరికా, ఈయూ తయారు చేయడం అసాధ్యం అవుతుంది. 17 రకాల లోహాలను కీలకమైనవిగా గుర్తించారు. వాటిని భూగర్భం నుంచి తీయడం, శుద్ధి చేయడం ఒక చైనాలో మాత్రమే ప్రస్తుతం జరుగుతున్నది. అందులో కీలకమైన నియోడైమియమ్, పైరాసియా డైమియామ్, డిస్ప్రోసిమమ్ వీటిని ఐస్కాంతం తయారికి వాడుతారు. ఇవి ఎలట్రిక్ కార్లు, డ్రోన్లకు కొత్త యంత్రాలు తయారీకి చాలా కీలకమైనవి. ఈ లోహాలను చైనా పుష్కలంగా కలిగి ఉండటం, ఇరత దేశాలు పూర్తిగా చైనాపై ఆధారపడడంతో అమెరికా ఓర్వలేని తనంతో ఏదో ఒక సాగు చూపి కయ్యం పెట్టుకుంటున్నది.