Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదల విద్య,వైదానికి కొరత : పోప్
వాటికన్: ప్రపంచంలో క్రైస్తవులకు పెద్ద అయిన పోప్ సంపన్నులకు పన్నులను తగ్గించడాన్ని వ్యతిరేకించారు. సంపన్నులకు పన్నులు తగ్గించడంతో పేదలకు విద్య, వైద్యం లాంటి అత్యవసర అంశాలకు డబ్బులు కొరత ఏర్పడుతుందని చెప్పు కొచ్చారు. పన్నులు తక్కువగా ఉంటే పెట్టుబడులు వచ్చి దేశాలు అభివృద్ధి అవుతాయని చెప్పడం సరికాదని పన్నుల స్వర్గదామాలో చాలా డబ్బు ఉన్నదని దాని ద్వారా పన్నుల నుంచి రావాల్సి ఆదాయం ప్రభుత్వాలకు రాకుండా పోతున్నదని చెప్పుతూ సంపన్నులపై పన్నులు తగ్గించాల్సిన అవసరం లేదని గట్టిగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలకు, ఆదాయం వస్తే పేదల విద్య, ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణకు ఖర్చు పెట్టుతాయని, పిల్లల అభివృద్ధికి పూనుకుంటాయని చెప్పారు. పేదరికం పెరుగుతున్నది. అయితే ఈ సమస్య పరిష్కరించగలదే పేదరిక నిర్మూలనకు పూనుకుంటే వ్యతిరేకించే వారు ఉండరని ఆయన తన అభిప్రాయంగా చెప్పారు.