Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: జూన్ 14 నుంచి 18 వరకు ఐదు రోజుల వర్చ్యువల్ అంతర్జాతీయ విద్యా కార్యక్రమం- న్యూజిల్యాండ్ పార్ట్నర్స్ వర్క్‌షాప్ వీక్ (NZPWW) 2021ను ఎడ్యుకేషన్ న్యూజిల్యాండ్ ప్రారంభించింది. ఆసియా ఖండంతో న్యూజిల్యాండ్ ఎడ్యుకేషన్‌కు ఉన్న సంబంధాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఏర్పాటైన ఈ ఫోరం- విలక్షణ లక్షణాలైన భవిష్యత్తుపై దృష్టి, తాజా పోకడలపై అప్డేట్లు, ఎడ్యుకేషన్ న్యూజిల్యాండ్ తాజా ప్రాధాన్యతలు, భాగస్వాములు ప్రయోజనాలను పొందేందుకు తీసుకుంటున్న నిర్ణయాల గురించి వివరించనుంది.
ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ ఆసియా విభాగం ప్రాంతీయ డైరెక్టర్ బెన్ బురోస్ మాట్లాడుతూ, ‘‘ఈ సమయంలో ప్రయాణాలు పరిమితం కావడంతో ఇండోనేషియా మరియు ఆసియా వ్యాప్తంగా విస్తృతంగా ఉన్న ప్రధాన భాగస్వాములను వర్చ్యువల్ విధానంలో భేటీ అయ్యేందుకు ఈ వర్క్‌షాప్ వీక్ ఒక విలువైన అవకాశాన్ని అందించిందని’’ తెలిపారు. ఈ వర్క్‌షాప్ వీక్‌లో ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ విద్యా నిపుణులు, ఎడ్యుకేషన్ ఏజెంట్లు, సలహాదారులు మరియు విద్యా భాగస్వాములు ఒక చోట సమావేశమై ఆలోచనల అనుసంధానానికి, సహకారానికి మరియు పంచుకునేందుకు సమావేశమయ్యారు.
‘‘సవాళ్లతో కూడిన ఈ సమయంలో కలిసి పనిచేయడం, అంతర్జాతీయ విద్యను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఏర్పాటు చేసిన భాగస్వాముల వర్క్‌షాప్ వీక్, సమిష్టిగా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరియు అటువంటి సవాళ్ల సమయంలో ఉత్తమ విధానాల గురించి షేర్ చేసుకునేందుకు మాకు సహాయపడింది. ‘‘అంతర్జాతీయ విద్యా నాయకులుగా - ప్రపంచం ఒక సంఘంగా పనిచేసేందుకు ప్రాధాన్యత ఇవ్వవలసిన సమయం ఇదేనని’’ అని బురోస్ పేర్కొన్నారు.
గ్రేటర్ చైనా, ఇండియా, వియత్నాం, థాయిల్యాండ్, సింగపూర్, దక్షిణ కొరియా, జపాన్, మలేషియా, ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్‌ల నుంచి అంతర్జాతీయ విద్యా నిపుణులు మరియు భాగస్వాములను NZPWW ఒక్క తాటిపైకి తీసుకు వస్తోంది. ఆరు వేర్వేరు భాషలైన ఇంగ్లీష్, వియత్నమీస్, థాయ్, కొరియన్, జపనీస్ మరియు ఇండోనేషియాలలో సెషన్లు అందుబాటులో ఉంటాయి. సుమారు 45 పైచిలుకు అంతర్జాతీయ వక్తలు తమ అభిప్రాయాలను ఈ వర్చ్యువల్ సదస్సులో ఇతరులతో పంచుకుంటుండగా, న్యూజిలాండ్ అప్డేట్లు మరియు ప్రత్యేకమైన దేశ-నిర్దిష్ట సెషన్లు, ప్యానెల్ చర్చలు, కీనోట్ ప్రెజెంటేషన్లు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వర్క్‌షాప్‌లు, నిపుణులతో ప్రత్యక్ష ప్రశ్నోత్తరాల సెషన్ మరియు వర్చ్యువల్ ప్రదర్శనలు ఇందులో ఉంటాయి. ఈ వర్క్‌షాప్ వీక్‌లో కె -12 విద్య, సాంకేతిక విద్య పరిజ్ఞానం, ఉన్నత విద్య, వృత్తి శిక్షణ మరియు పని ఆధారిత విద్య, అలాగే ఆంగ్ల భాషా నైపుణ్య శిక్షణ తదితర విభాగాలు భాగంగా ఉన్నాయి. నేటి ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశాల్లో న్యూజిలాండ్‌కు చెందిన సంగీత కళాకారుడు స్టాన్ వాకర్ ప్రదర్శన మరియు ప్రత్యేక కో టావ్ రౌరో వైటా ప్రదర్శన, ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్రాంట్ మెక్ఫెర్సన్తో మరియు ఆసియా వ్యాప్తంగా ఉన్న ఆరు న్యూజిలాండ్ హెడ్స్ ఆఫ్ మిషన్‌తో ప్యానెల్ చర్చ ఉన్నాయి.
‘‘మా అంతర్జాతీయ విద్యా భాగస్వాములను మేము ఎంతో విలువైన వ్యక్తులుగా భావిస్తున్నాము- న్యూజిల్యాండ్‌కు ప్రస్తుత మరియు కాబోయే భాగస్వాములు అనుసంధానం అయ్యేందుకు, సహకరించుకునేందుకు, ముఖ్యమైన ప్రశ్నలు అడిగేందుకు మరియు అంతర్జాతీయ విద్య భవిష్యత్తు గురించి విలువైన ఆలోచనలు, సలహాలను పంచుకునేందుకు వీరంతా మాతో చేరడం ఆనందంగా ఉందని’’ బురోస్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ భాగస్వాముల వర్క్‌షాప్ వీక్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు అందుబాటులో ఉంది- భాగస్వాములు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు.