Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్ కోర్టు ఆదేశాలు
వెర్సాయిల్లీస్ : స్వీడన్‌కి చెందిన హౌం ఫర్నిచర్స్ దిగ్గజ సంస్థ ఐకియాకు ఫ్రెంచి కోర్టు పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. ఫ్రాన్స్‌లో కొంతమంది వినియోగదారులపై, ఉద్యోగులపై, యూనియన్ నేతలపై గూఢచర్యానికి పాల్పడుతున్నందుకు పది లక్షలకి పైగా యూరోలను (12లక్షల డాలర్లు) జరిమానాగా, నష్టపరిహారంగా చెల్లించాలని మంగళవారం కోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఇద్దరు పూర్వపు ఐకియా ఫ్రాన్స్ ఎగ్జిక్యూటివ్‌లను దోషులుగా నిర్ధారించి, జరిమానాలు, సస్పెండ్ చేసిన జైలుశిక్షలు విధించింది. అత్యున్నత స్థాయిలో జరిగిన ఈ విచారణలో మొత్తంగా 13మందిలో కొంతమందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. మరికొంతమందికి సస్పెండ్ చేయబడిన జైలు శిక్షలు విధించింది. ఈ అవకతవకలన్నింటినీ వెలికి తీయడానికి సహకరించిన పూర్వపు ఐకియా ఉద్యోగి అబెల్ అమరా ఈ తీర్పును 'సామాన్య పౌరుడిని రక్షించే దిశగా అతి పెద్ద ముందంజ'గా అభివర్ణిం చారు. ఫ్రాన్స్‌లో న్యాయం వుందని సంతోషిస్తున్నానని అన్నారు. 2009 నుండి 2012 మధ్య కాలంలో సిబ్బందిలో, విని యోగదారుల్లో ఇబ్బంది పెట్టేవారిని గుర్తించేందుకు ఐకియా ఈ గూఢ చర్యాన్ని చేపట్టిందని న్యాయమూర్తుల ప్యానెల్ పేర్కొంది. తప్పుడు మార్గాల ద్వారా సిబ్బంది డేటాను ఐకియా ఫ్రాన్స్ శాఖ సేకరించిందని, వాటిని అక్రమంగా వెల్లడిస్తూ వచ్చిందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.