Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: నాటో సైనిక కూటమి ఒక రోజు సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ పాల్గొన్నారు. ఇందులో 30 దేశాలు సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్ హయాంలో దేశాల మధ్య సంబంధాల విషయంలో ఏర్పడిన పొరపచ్చలను సరి చేసుకోవాలనీ, మళ్ళీ ప్రపంచంలో అమెరికా నాయకత్వ పాత్రను నిలబెట్టుకోవాలని బైడెన్ జీ-7 దేశాల సమావేశం, నాటో సమావేశంలో స్వయంగా పాల్గొన్ని సభ్య దేశాలకు ఒక నమ్మకం కలిగెలా ప్రయత్నించారు. ఈ సందర్భంలో చైనాను లక్ష్యంగా చేసుకుని చైనా వ్యతిరేకత ఆధారంగా కూటములు పనిచేసే విధంగా దిశా నిర్దేశం చేశారు. దానితో పాటు రష్యాను కూడ కలిపి ప్రపంచ భద్రతకు చైనా, రష్యా నుంచి ప్రమాదం ఉందన్నారు.
తమ దేశ వ్యవహారాల్లో తలదూర్చొదు : చైనా హెచ్చరిక
చైనా సైనిక బడ్జెట్ భారీ స్థాయిలో ఉన్నదని దాని ఆధారంగా వైమానిక, నావిక రంగాల్లో ఆధునిక ఆయుధాలను ప్రవేశపెడుతున్నదనీ, కృత్రిమ వైద్యరంగం చాలా వేగంగా ముందుకుపోతున్నదని కావున దాన్ని అమెరికా, నాటో దేశాలు అధిగమించాలని భావించాయి. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనలు విపరీతంగా జరుగుతున్నాయనీ, హంగ్‌కాంగ్, తైవాన్ సమస్య అలానే ఉన్నదని తప్పుపట్టారు. దీనిపై చైనా తీవ్రంగా స్పందించింది. మా దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. చైనాను బదనాం చేసే పనిని విరమించుకోవాలని తెలిపింది. చైనా అంతర్గత విషయాల్లో తలదూర్చొద్దని తేల్చి చెప్పింది. నాటో సమావేశాల సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు జరిగినాయి.