Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: ఇంగ్లండ్‌లో కేసులు తగ్గుతున్నందున జూన్ 21 నుంచి లాక్డౌన్ ఎత్తివేయాలని అక్కడి ప్రభుత్వం యోచించింది. కాగా, తాజాగా అక్కడ డెల్టా వేరియంట్ వెలుగులోకి వచ్చింది. దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తించిన ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జులై 19వరకూ పొడిగించాలని నిర్ణయించింది. ఇంగ్లండ్‌లో ఇది నాలుగో దశ లాక్డౌన్. దాన్ని ముగించే రోజును 'సేచ్ఛా దినం' అని పేరు పెట్టారు. ఈ పొడిగింపు వలన తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో చికిత్స, వాక్సినేషన్‌కు మరింత అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఐసోలేషన్, వ్యాక్సినేషన్‌కి తగిన సమయం కావాలి కావున పొడిగింపు అనివార్యం అయింది.