Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: అమెజాన్ కంపెనీ బ్లూ ఓరిజన్ పేరుతో అంతరిక్ష పర్యాటక వ్యాపారాన్ని ప్రారంభించింది. వచ్చే నెల అమెజాన్ అధినేత జెఫ్ బిజుస్ ఆయన సోదరుడు మార్క్‌తో పాటు ఇద్దరు అంతరిక్షంకు వెళ్ళనున్నారు. బిజోస్తో వెళ్ళే వారిని ఎంపిక చేయాడానికి జరిపిన వేలం పాటలో ఒక వ్యక్తి 28 మిలియన్ డాలర్లకు గెలుచుకున్నారు. ఆయన పేరును రెండు వారాల తరువాత ప్రకటిస్తారు. నాలుగో వ్యక్తి పేరు కూడా తరువాతనే ప్రకటిస్తారు. ఈ వేలం పాటలో 7500 మంది 159 దేశాల నుంచి పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలోని 20 మంది ఎక్కువ కోట్ చేసిన వారి మధ్య జరిగిన పోటీలో ఒక వ్యక్తి 28 బిలియన్ డాలర్లు పలకడంతో ఈ అవకాశం ఆయనకు దక్కింది. ఈ వేలంలో వచ్చిన సొమ్మును శాస్త్ర విజ్ఞానాన్ని మరింత మెరుగు పరిచే కార్యక్రమాలకు వెచ్చిస్తామని అమెజాన్ ప్రతినిధి ప్రకటించారు.