Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేలుడుపదార్ధాలు నింపిన బెలూన్లతో ఇజ్రాయిల్ దాడి
-నిర్ధారించిన ఇజ్రాయిలె డిఫెన్స్‌ఫోర్స్
జెరూసలెం : గాజా బాంబుల మోతతో దద్దరిల్లింది. బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వాయుసేన గాజాలోని ఖాన్ యూనిస్ అనే ప్రదేశంపై దాడులు చేశాయని, పేలుడు పదార్ధాలతో నింపిన బెలూన్లను వేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది. ఈ బెలున్ల కారణంగా దేశంలోని పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయని ఇజ్రాయెల్ ఫైర్ సర్వీస్ స్పష్టం చేసింది. 20 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల జరిగాయని పేర్కొంది. హమాస్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్న అనుమానంతో ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ బాంబులు కురిపించింది. కాగా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నట్టు ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. ఈ దాడుల్లో గాయపడిన వారి వివరాలు వెల్లడించలేదు. ఈ దాడులపై హమాస్ ప్రతినిధి మాట్లాడుతూ.. జెరూసలెంలోని పవిత్ర ప్రదేశాల్లో హక్కులను కాపాడుకోవడానికి ప్రతిఘటన కొనసాగిస్తామని అన్నారు. మే 21 తర్వాత జరిగిన హింసాత్మక ఘటన ఇది. గత నెలలో ముస్లింలకు పవిత్రమైన జెరూసలేంలోని అల్-అక్సా మసీదు వద్ద భద్రతా దళాలు.. స్థానికుల మధ్య భారీగా ఘర్షణలు జరిగాయి. తూర్పు జెరూసలేంలోని షేక్ జర్రా, సిల్వాన్ వద్ద పాలస్తీనీయులను ఖాళీ చేయించే క్రమంలో వివాదం చెలరేగింది. శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన వారికి, ఇజ్రాయెల్ దళాలకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ పరిణామాల అనంతరం గాజా పట్టీ నుంచి హమాస్ ఉగ్రవాద సంస్థ రాకెట్ దాడు లను చేసింది. వందల సంఖ్యలో రాకెట్లను వినియో గించినట్లు ఇజ్రాయెల్ దళాలు పేర్కొంటున్నాయి. ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ ఎఫ్-16 యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో పలువురు స్థానికులు ప్రాణాలు కోల్పో యారు. 11 రోజుల ఘర్షణ తర్వాత ఈజిప్ట్, అమెరి కా చొరవతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం జరిగి నెలరోజులు కూడా పూర్తికా కుండానే మరోసారి దాడులు జరగడం గమనార్హం.