Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్ సమర్పిస్తున్నపుడు అధికార,ప్రతిపక్షాల మధ్య తోపులాట
- బడ్జెట్ పత్రాలు చింపి విసిరేత.. మహిళా ఎంపీకి గాయాలు..
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పార్లమెంట్లో ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఇమ్రాన్‌ఖాన్ సర్కార్ మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినపుడు...ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరే కించాయి. బడ్జెట్ పత్రాలు చింపి విసిరేశారు. పేదలకు ప్రమాదకర బడ్జెట్ అంటూ పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. తోపులాట జరగటంతో ఓ మహిళా ఎంపీకి గాయాలయ్యాయి.
ఎందుకీ గందరగోళం..
బడ్జెట్ ప్రతిపాదనపై చర్చించడానికి ఇటీవల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్థిక మంత్రి షౌకత్ తరీన్ బడ్జెట్‌ను సమర్పించారు. ఇమ్రాన్ సర్కార్ మూడేండ్లు పూర్తి చేసుకున్నది. అయితే పాక్ ఆర్థికమంత్రి షౌకత్ ,అతని సోదరుడు జహంగీర్ తరీన్ తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదు ర్కొంటున్నారు. వారిద్దర్నీ ఇమ్రాన్‌కు సన్నిహితులు కాబట్టే వారిద్దర్నీ రక్షిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడైన షాబాజ్ షరీఫ్ మాట్లాడటానికి నిలబడగానే, అధికారపక్ష ఎంపీలు అడ్డు కోవటం ప్రారంభించారు. మైక్ కట్ చేశారు. దాంతో అప్పటి వరకు శాంతియుతంగా నడుస్తున్న సమావేశం ఒక్క సారిగా రణరంగంలా మారిపోయింది.ఈ గొడవలో ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ మహిళా ఎంపీ మాలెకా బుఖారీ గాయపడ్డారు.ఈ ఘటనకు బాధ్యులు ప్రతిపక్షా లంటూ అధికారపక్షం ఆరోపించింది. అధికార, ప్రతిపక్ష సభ్యులమధ్య తోపులాట, బడ్జెట్ పత్రా లను చింపివేసి నపుడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చోద్యంలా చూస్తుండి పోయారనీ, కనీసం ఈ గొడవను నివారిం చటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని ప్రతిపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.