Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ : 60ఏండ్లు పైబడిన వారికి మాత్రమే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ను ఉపయోగించాలని ఆస్ట్రే లియా నిపుణుల కమిటీ సిఫారసు చేయనున్నదని ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. ఇమ్యూనైజేషన్పై ఆస్ట్రేలియా సాంకేతిక సలహా బృందం (ఏటీఏజీఐ) నుంచి ప్రభుత్వ నేతలకు ఈ మేరకు సిఫారసు అందిందని నైన్ న్యూస్ తెలిపింది. దీనిపై అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం జరగనున్నదని తెలిపింది. 50ఏండ్లలోపు వారు ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఏప్రిల్లో ఆస్ట్రేలియా సిఫారసు చేసింది. ఆస్ట్రాజెనిక--ా వల్ల రక్తం గడ్డలు కడుతున్నదని ఆందోళనలు వచ్చిన నేపథ్యంలో దానికన్నా ఫైజర్ వ్యాక్సిన్కే ప్రాధాన్యతనిచ్చింది. కాగా తాజా సిఫారసుపై ఆస్ట్రేలియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించలేదు.