Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదివేలకు చేరువలో మరణాలు
- ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల తీరిది..
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కన్నెర్ర చేస్తూనే ఉన్నది. 3 లక్షల 97 వేల 962 మందికి కోవిడ్ సోకినట్టు నివేదిక విడుదల చేసింది. 9,464 మంది కరోనాతో చనిపోయారు. ప్రపంచంలో గత 15 రోజుల్లో 19.50 లక్షల క్రియాశీల కేసులు తగ్గాయి. జూన్ 1 న ప్రపంచంలో 1 కోటి 36 లక్షల 12 వేల 40 క్రియాశీల కేసులు నమోదుకాగా, నిన్నటివరకు 1 కోటి 16 లక్షల 61 వేల 467 కి పడిపోయింది.
బ్రెజిల్లో అత్యధిక కేసులు
ప్రపంచంలో అత్యధిక కేసులు బ్రెజిల్లో నమో దవుతున్నాయి. ఇక్కడ 85,861 మందిలో కరోనా నిర్ధారించారు. అత్యధికంగా 2,673 మరణాలు నమోదయ్యాయి. భారత్లో 67,294 కేసులు, 1,411 మంది ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు.
కొలంబియా-అర్జెంటీనాలో పెరిగిన కేసులు
భారత్, బ్రెజిల్ తో పాటు కొలంబియా, అర్జెంటీనాలో 25 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కొలంబియాలో బుధవారం 27,827 మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారించగా 595 మంది మరణించారు. అలాగే అర్జెంటీనాలో 25,878 మంది కరోనా సోకింది. 646 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటివరకు 17.78 కోట్ల కేసులు
ప్రపంచంలో ఇప్పటివరకు 17.78 కోట్లకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 38.49 లక్షల మంది మరణించగా, 16.23 కోట్ల మంది కరోనాను ఓడించారు. ప్రస్తుతం 1.16 కోట్ల మంది ప్రజలు చికిత్స పొందుతున్నారు. వీరిలో 1.15 కోట్ల మందికి కరోనా యొక్క తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. 83,022 మంది పరిస్థితి విషమంగా ఉన్నది.