Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవంతంగా లాంగ్‌మార్చ్ రాకెట్ ప్రయోగం
బీజింగ్ : చైనా గురువారం ముగ్గురు వ్యోమగాములను విజయ వంతంగా రోదసీ స్టేషన్‌కు పంపింది. మూడు మాసాల ప్రాజెక్టు నిమిత్తం వీరు చైనా రోదసీ స్టేషన్‌లోని కోర్ మాడ్యూల్ తియాన్హెలో వుంటారు. లాంగ్ మార్చ్-2ఎఫ్ కేరియర్ రాకెట్‌ను తీసుకుని వెళుతున్న షెంఝూ-12 అంతరిక్ష నౌకను వాయవ్య చైనాలోని గోబి ఎడారిలోని జియుక్వన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి ప్రయోగించారు. ఈ ప్రయోగ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిజిటిన్-టివి ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇప్పటివరకు చైనా రోదసీలోకి పంపిన ఏడవ బృందం ఇది. చైనా రోదసీ స్టేషన్ నిర్మాణం సమయంలో పంపిన మొదటి బృందం ఇదని చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ (సీఎంఎస్ఎ) తెలిపింది. 2016లో చివరిసారిగా సిబ్బందిని పంపిన ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పంపారు. వీరిలో ఇద్దరు సీనియర్లు కాగా, ఒకరు మొదటిసారిగా వెళ్ళారు. 2016లో షెంఝూ-11లో సిబ్బంది 33రోజుల పాటు రోదసీలో గడిపారు. కానీ తాజాగా వెళ్ళినన బృందం మరికొంత కాలం అక్కడ గడిపి రికార్డు సృష్టిస్తారని భావిస్తున్నారు. కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత షెంఝూ-12 అంతరిక్ష నౌక అక్కడ రోదసీ స్టేషన్‌లోని కోర్ మాడ్యూల్తో అనుసంథానమవుతుంది. గత మిషన్ల కన్నా ఈసారి ఈ వ్యోమగాముల పని మరింత సంక్లిష్లమైనంది, సవాళ్ళతో కూడినదని సిఎంఎస్‌ఎ డైరెక్టర్ తెలిపారు. కక్ష్యలో నాలుగు ప్రధానమైన కర్తవ్యాలను షెంఝూ-12 సిబ్బంది పూర్తి చేయనున్నారు. తియాన్హె మాడ్యూల్ కక్ష్య పరీక్షతో పాటు రీసైక్లింగ్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ను పరిశీలించనున్నారు. రోబోటిక్ చేయిని పరీక్షించనున్నారు. అలాగే అక్కడి వ్యర్ధ పదార్ధాల నిర్వహణను కూడా చేపట్టనున్నారు.