Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాప్ట్కు ఇన్నాళ్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా వ్యవహారిస్తున్న తెలుగు తేజం సత్య నాదేళ్లను ఆ కంపెనీ నూతన చైర్మెన్‌గా నియమించింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న జాన్ థాంప్సన్‌ను పక్కన పెట్టి నాదేళ్లకు అవకాశం కల్పించడం విశేషం. 2014లో మైక్రోసాఫ్ట్ సారథి బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల కంపెనీ అభివద్ధిలో కీలకపాత్ర పోషించారు. పలు విభాగాల్లో కంపెనీ వ్యాపారం భారీగా పెరిగింది. ఆయన ఆధ్వర్యంలోనే లింక్డిన్, న్యువాన్స్ కమ్యూనికేషన్స్, జెనిమ్యాక్స్‌లాంటి కంపెనీలను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. 2014లో బిల్ గేట్స్ నుంచి చైర్మెన్ పదవిని అందుకున్న థాంప్సన్ ఇకపై స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగనున్నట్టు కంపెనీ వెల్లడించింది. ''వ్యూహాత్మక అవకాశాలను దక్కించుకునేందుకు, కీలక ఇబ్బందులను గుర్తించేందుకు నాదేళ్లకు వ్యాపారంపై ఉన్న అవగాహన బాగా ఉపయోగపడనున్నది'' అని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దాతృత్వ పనులు నిమిత్తం బోర్డు నుంచి వైదొలగుతానని బిల్‌గేట్స్ ప్రకటించిన ఏడాది తరువాత ఉన్నత స్థాయి కీలక ఎగ్జిక్యూటివ్‌ల హోదాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.