Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : మయన్మార్ సంక్షోభానికి తెరదించుతూ ఐక్యరాజ్యసమితి ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ జరగగా..అందులో భారత్ పాల్గొనలేదు. ఎన్నికల్లో మయన్మార్ ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని సైనికాధికారులను కోరుతూ సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. భారత్‌తోపాటు మయన్మార్‌కు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, చైనా, లావోస్, నేపాల్, థాయిలాండ్, రష్యా సైతం ఓటింగ్‌కు దూరంగా ఉండటం గమనార్హం. ఒక్క బెలారస్ మాత్రమే తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా, 119 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. మయన్మార్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని, పాలన పగ్గాలను సైన్యం తమ చేతుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే అంగ్‌సాన్ సూచీ వంటి కీలక నేతల్ని ఇప్పటికీ నిర్బంధంలో ఉంచారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు చేస్తున్న నిరసనల్లో ఇప్పటివరకు అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.