Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మయన్మార్ రాజకీయ సంక్షోభానికి ఓ పరిష్కారం కనుగొనేందుకు ఇప్పటికే ప్రాంతీయ కూటమి అయిన ఃఆసియాన్ః ప్రక్రియ ప్రారంభించిందని ఐరాసలో భారత రాయబారి టి.ఎస్.తిరుమూర్తి వెల్లడించారు. ఈ ప్రయత్నాలకు సహకరించేలా ప్రస్తుతం ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానం లేదని స్పష్టం చేశారు. సరిహద్దులు పంచుకుంటున్న దేశంగా మయన్మార్‌లోని పరిస్థితులు, పొరుగు దేశాలపై వాటి ప్రభావంపై భారత్‌కు స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు. ఈనేపథ్యంలో మయన్మార్‌కు పొరుగున ఉన్న దేశాలను సంప్రదించకుండానే తీర్మానాన్ని రూపొందించటం సరైంది కాదన్నారు. భారత్ అభిప్రాయాలు, ఉద్దేశాలను తీర్మానం ప్రతిబింబించడం లేదని తెలిపారు. ఈనేపథ్యంలో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నామన్నారు.