Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెహ్రాన్: ఇరాన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఇబ్రహిమ్ రైసే గెలుపొందారు. ఆ దేశంలోని అధికార పార్టీకి చెందిన రైసే ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థకు అధిపతిగా ఉన్నారు. రైసేకి 61.95శాతం ఓటుల వచ్చాయి. ఈసారి ఎన్నికలలో 48.8శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆగస్టులో రైసే బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎన్నికలను బహిష్కరించిన ఇరాన్ కమ్యూనిస్టు పార్టీ
అధ్యక్ష ఎన్నికలను ఇరాన్ తుడే పార్టీ (ఇరాన్ కమ్యూనిస్టు పార్టీ)బహిష్కరించింది. నిరంకుశ, మత ఛాందసవాద ప్రభుత్వం ఎన్నికలను ఒక ప్రహసనంగా మార్చుతున్నందున ప్రజస్వామ్యవాదులు, దేశ భక్తి యుత శక్తులు ఈ ఎన్నికలను బహిష్కరించాలని తుడే పార్టీ పిలుపునిచ్చింది. ఇరాన్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రజావ్యతిరేకమైనది, అవినీతికరమైనది, మతఛాందసవాదంతో కూడినట్టిది. దీనికి ప్రధాన సూత్రధారి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ. దీనిని తొలగించి ప్రజలందరి భాగస్వామ్యంతో కూడిన ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తుడే పార్టీ కోరింది. శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, కార్మికుల హక్కుల కోసమే ఈ ఎన్నికలను బహిష్కరించినట్లు పార్టీ తెలిపింది. ప్రస్తుతం న్యాయవ్యవస్థ అధిపతిగా ఉన్న రైసీ 1988లో వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధులను, రాజకీయ ఖైదీలను అమానుషంగా పొట్టనబెట్టుకున్నారు. ఆయన నేర చరితను కప్పిపుచ్చి గొప్ప నాయకుడిగా కీర్తిస్తూ ప్రభుత్వ ప్రచార బాకాలు, మితవాద శక్తులు ప్రచారం చేశాయి. అయినా ఈ నెల 18న జరిగిన ఎన్నికల పోలింగ్లో 42 ఏళ్ల అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ లేనంత తక్కువ ఓట్లు (37-47 శాతం మధ్య) పోలయ్యాయి. అణగారిన వర్గాల ఓటర్లు ఈ ఎన్నికలకు చాలావరకు దూరంగా ఉండడం ఓటింగ్ ప అదే రోజు అలీ ఖమేనీ జాతి నుద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలను ఘనంగా నిర్వహించడంలో కృతకృత్యులం కాలేకపోయామని అంగీకరించారని కమ్యూనిస్టు పేర్కొంది. ఈ మతవాద, మితవాద ప్రభుత్వాన్ని మార్చనిదే ఇరాన్ ప్రజలకు నిష్కృతి లేదని తుడే పార్టీ తెలిపింది. ఈ మతరాజ్య వ్యవస్థ సంస్కరించబడదని, దీనిని తొలగించడమొక్కటే మార్గమని కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది.