Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 40ఏండ్ల కనిష్ట స్థాయికి జలం
- రెండో అతిపెద్ద అరోవిల్ ఆనకట్టలో 35శాతమే నీటినిల్వ
కాలిఫోర్నియా: యునైటెడ్ స్టేట్స్ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో కరువు ముప్పుపొంచి ఉన్నది.ఇక్కడి జలాశయాలు 40 ఏండ్ల కనిష్టానికి చేరటంతో స్థానికుల్లో ఆందోళన ఎక్కువవుతున్నది.నీటి నిల్వ సామర్థ్యం 35 శాతం ఉండటతో..వరుణుడి వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కాలిఫోర్నియాలో రెండవ అతిపెద్ద ఆరోవిల్ ఆనకట్ట ఉన్నది. ఇక్కడ కొన్నేళ్లుగా వర్షం లేకపోవడంతో ఎండిపోతోంది. నాలుగు కోట్ల మంది జనాభా ఉన్న ఈ రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారంటే..కరువు ప్రభావం ఎంతగా ఉన్నదో స్పష్టమవుతున్నది.
ఆరోవిల్ ఆనకట్ట 35 చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉన్నది.40 కౌంటీలలో 27 మిలియన్ల మందికి నీటి సరఫరా జరుగుతున్నది.
అయితే గత కొన్ని ఏండ్లుగా వర్షాలు కురవటంలేదు. దీంతో ఆనకట్ట ఎండిపోతోంది. ఈ సరస్సులో ఉన్న 200 కి పైగా హౌస్బోట్లను ఖాళీ చేస్తున్నారు. దీనికి సంబంధించి గవర్నర్ ఆదేశాలిచ్చారు. ఆనకట్టలో నీటి మట్టం నిరంతరం పడిపోవడంతో హౌస్బోట్లు దెబ్బతినవచ్చని ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.
1967 ఆరోవిల్ డ్యామ్‌లో మొదటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్‌ను నిర్మించారు, ఇది ఏటా 8 లక్షల ఇండ్లకు విద్యుత్తుసరఫరా చేస్తుంది. ఆనకట్ట యొక్క ఎండిపోవటంతో..తొలిసారిగా మూసివేయవచ్చనే సంకేతాలొస్తున్నాయి. ఈ ప్లాంట్ నుంచే కాలిఫోర్నియాకు అవసరమైన విద్యుత్‌లో 13 శాతం కరెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎన్నడూ చూడని కరువుపరిస్థితులను ఎదుర్కొంటున్నామనీ, వర్షాలు కురిస్తే కానీ కష్టాలు తీరవని కాలిఫోర్నియా వాసులు అంటున్నారు.