Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెహ్రాన్: తాజాగా జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికలలలో ఇబ్రహిమ్ రైసీ (60 సంవత్సరాలు ) గెలుపొందాడు. ఆయన ఇరాన్‌లోని సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన కరుగుగట్టిన సాంప్రదాయవాది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయాతుల్లా అలీ కోమెనీకి అత్యంత ఆప్తుడు. 1980-88 వరకు జరిగిన ఇరాన్, ఇరాక్ యుద్ధం తరువాత అప్పటి ఇరాన్ నాయకుడు కోమెనీ రాజకీయ ఖైదీలను చంపడానికి రహస్య ఉత్తర్వులు జరీ చేశారు. ఆ జాబితాలో ఇరాన్‌లోని వామపక్ష పార్టీలైన ఫైదీయన్, తుదే పార్టీకి సంభందించిన వారు చాలా మంది ఉన్నారు. ప్రతిపక్ష నాయకులను చంపడానికి నలుగురితో ఒక కమిటీ వేశారు. దాని డెత్ కమిషన్ అంటే (చంపడానికి కమిషన్) అని పేరు పెట్టారు. ఆ కమిటీలో రైసీ కీలకమైన వ్యక్తి. ఆ రోజులలో జరిగిన రక్తపు చరిత్రలో ఆయన చేతలకు రక్తం అంటింది. ఇప్పుడు ఆయన శాంత వచనాలు మాట్లాడుతున్నారు. అవినీతి అంతం చేస్తానంటున్నారు. ఇరాన్ మతపరమైన రాజ్యాంగం మరింత బలపడటానికి రైసీ గెలుపు కారణం అయ్యే అవకాశం ఉన్నది.