Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారకాస్: వెనెజులాలోని ప్రతిపక్ష పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని అమెరికాకు వెళ్ళి తమ దేశంపై అమలవుతున్న ఆంక్షలు ఎత్తివేయాలని కోరనున్నాయి. ఈ కమిటీ అమెరికాతో పాటు యూరప్‌లో కూడా పర్యటించనున్నది. ఈ కమిటీ ఇప్పటికే నార్వేలోని అధికారులను కలిసి, వెనెజులా అధ్యక్షుడితో చర్చలు జరపడానికి అవకాశాలను పరిశీలిస్తున్నది ఈ ప్రతిపక్ష పార్టీల కమిటీకి గైడో నాయకత్వం వహిస్తున్నారు. ఆయన అమెరికా ప్రోద్భలంతో వెనెజులా అధ్యక్షుడు మదురోపై అనేక నిందలు వేసి ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నించిన వ్యక్తి. ఇప్పుడు రూటు మార్చి అమెరికాతో చర్చలు జరిపి ఆంక్షలు ఎత్తివేయించేందుకు ప్రయత్నించుతాను అనడం కొంత పరిశీలించాల్సిన అంశం ఎందుకంటే ఆంక్షలు ఎత్తివేయడానికి వెనెజులాలో సేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహిస్తామని మదురో హామి ఇవ్వాలని షరత్తు పెట్టడం అనేక ప్రశ్నలను ముందుకు తెస్తున్నది.