Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: 1865 జూన్ 19న అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేసిన రోజు ఆ రోజును ఇప్పుడు అంటే 156 సంవత్సరాలకు జాతీయ సెలవు దినంగా బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి జూన్ 19న శనివారం కావడంతో శుక్రవారం నాడే అమెరికా అంతటా పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ఆ రోజు అమెరికా వ్యాప్తంగా నల్లజాతి ప్రజలతోపాటు ఇతరులు కూడా ఉత్సవాల్లో పాల్గొనడం కనపడింది. టెక్సాస్లోని గాల్వేస్టన్ నగరం ఈ పర్వదినం పుట్టడానికి కారణం అక్కడ 5000 చదరపు అడుగులలో '' సంపూర్ణ సమానత్వం '' అని రాసిన ఫలకాన్ని ఏర్పాటు చేశారు. 1865లో నల్లజాతి ప్రజలకు స్వేచ్ఛను ప్రకటించినా నల్లజాతి ప్రజలకు మాత్రం రెండున్నర సంవత్సరాల తరువాత ఆ విషయాన్ని తెలియజేశారు అనేది గుర్తించాల్సిన అంశం.