Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైజర్ సీఈఓ
వాషింగ్టన్ : భారత్‌కు కోవిడ్-19 వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉందని అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ ఫైజర్ సీఈఓ అల్బర్ట్ బౌర్లా తెలిపారు. మంగళవారం అమెరికా-భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన 15వ ఎడిషన్ బయో ఫార్మా హెల్త్‌కేర్ సదస్సులో అల్బర్ట్ మాట్లాడారు. భారత్‌తో పాటు ఇతర పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు 200 కోట్ల డోసులు సరఫరా చేయాలని తమ సంస్థ ఒక నిర్ధిష్ట ప్రణాళికను రూపొందించుకుందన్నారు. తమ వ్యాక్సిన్‌కు త్వరలోనే భారత ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందని, ఒప్పందం ఖరారు అనంతరం వ్యాక్సిన్ల సరఫరాను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఏడాది ఆఖరుకు 300 కోట్ల డోసులు, వచ్చే ఏడాదిలో 400 కోట్ల డోసులు.. మొత్తంగా 700 డోసులు ఉత్పత్తి చేయాలని ఫైజర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని ఆల్బర్ట్ తెలిపారు.