Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలబామా : అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బీచ్‌లో విహారయాత్రకు వెళ్లిన చిన్నారులు వ్యాన్‌లో తిరిగి వస్తుండగా అలబామాలోని ఇంటర్‌స్టేట్ హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. వారిలో 9 మంది చిన్నారులే ఉన్నారు. మతిచెందిన చిన్నారులంతా 3 నుంచి 17 ఏండ్ల మధ్య వయసువారే. అలబామాలో కొన్ని రోజులుగా టొర్నడోలు విజంభిస్తుంది. వరదనీటిలో కొట్టుకొచ్చిన వాహనాలు ఒకదానికొకటి ఢకొీంటూ చిన్నారులు ప్రయాణిస్తున్న వ్యాన్‌ను ఢకొీన్నాయి. దీంతో వ్యాన్‌లో మంటలు చెలరేగి డ్రైవర్ సహా చిన్నారులంతా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 17 వాహనాలు ఒకదానికి ఒకటి ఢకొీనగా అందులో ఏడు వాహనాలు దగ్ధమయ్యాయి. మిగతా వాహనాల్లో మనుషులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.