Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా దుశ్చర్య
వాషింగ్టన్ : ఇరాన్ అనుకూల అమెరికన్ వార్తా చానళ్లకు చెందిన అనేక వెబ్సైట్లను అగ్ర రాజ్యం నిలిపేసింది. తన చర్యను సమర్థించుకునేందుకు ఇవి తప్పుడు సమాచారం అందిస్తున్నాయని అమెరికా జాతీయ భద్రతాధికారులు ఆరోపించారు.. ఇరాన్‌తో సంబంధం ఉన్న న్యూస్ పోర్టల్ ప్రెస్టివి.కామ్‌ను కొంత మంది వీక్షకులు చూడలేరని సీఎన్ఎన్ పేర్కొంది. దీన్ని చూడాలని ప్రయత్నించినవారికి 'బ్యూరో ఆఫ్ ఇండిస్టీ అండ్ సెక్యూరిటీ, ఆఫీస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎన్ఫోర్స్మెంట్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకునే చట్టపరమైన చర్యల్లో భాగంగా ప్రెస్టీవీ.కామ్ పై నిషేధం ఉన్నట్టు' ఒక ప్రకటన దర్శనమిస్తుంది. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. తమకు చెందిన అనేక వార్తా సంస్థల వెబ్సైట్లను బ్లాక్ చేసినట్టు తెలిపింది.