Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి
లాహోర్ : ముంబయి తీవ్రవాద దాడి సూత్రధారి, జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ నివాసం వెలుపల బుధవారం జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 20మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. లాహోర్లో సయీద్ నివాసం వెలుపల పోలీసు పికెట్ వద్ద గల బీఓఆర్ సొసైటీ వద్ద కారులో పెట్టిన బాంబు పేలింది. అక్కడ పోలీసు పికెట్ గనుక లేకపోతే నష్టం ఇంకా పెద్ద ఎత్తున వుండేదని పంజాబ్ పోలీసు చీఫ్ ఇనామ్ ఘని వ్యాఖ్యానించారు.