Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : భారత్‌లో తొలిసారిగా వెలుగుచూసిన డెల్టా వేరియంట్... అమెరికాలో కరోనా నిర్మూలనకు బైడెన్ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను గండికొడుతోందని ఆ దేశ అంటువ్యాధి నిపుణులు డాక్టర్ అంథోని ఫౌసి అన్నారు. కోవిడ్-19 వేరియంట్ కన్నా ఈ డెల్టా వేరియంట్‌కు నిస్సందేహంగా వ్యాప్తి స్థాయి ఎక్కువని పేర్కొన్నారు. ఇది వ్యాధి తీవ్రతతో ముడిపడి ఉందని తెలిపారు. డెల్టా వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతోందని అన్నారు. ఫైజర్, బయో ఎన్‌టెక్ వ్యాక్సిన్లతో సహా అమెరికాలో ఆమోదం పొందిన టీకాలు కోవిడ్-19 కొత్త వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ టూల్స్‌ను వినియోగించి... మహమ్మారి వ్యాప్తిని అరికడదామని పిలుపునిచ్చారు. జులై 4 నాటికి వయోజనుల్లో 70 శాతం మంది వ్యాక్సిన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా... దీనికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోందని శ్వేత సౌధం కోవిడ్-19 సీనియర్ సలహాదారు జెఫ్రీ జైంట్స్ తెలిపారు. 27 ఏండ్లు పైబడిన వారికి జులై 4 నాటికి కనీసం ఒక డోసు ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.