Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనీలా : ఫిలిప్పీన్ మాజీ అధ్యక్షుడు బెనిగ్నో అక్వినో 3 (61) గురువారం తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అక్వినో గత ఐదు నెలలుగా డయాలిసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, ఇటీవల గుండె ఆపరేషన్ జరిగిందని చెబుతున్నాయి. అనారోగ్యానికి గురికావడంతో గురువారం ఆసుపత్రిలో చేరి.. చికిత్స పొందుతుండగా కన్నుమూశారు. అక్వినో 2010 నుండి 2016 వరకు ఫిలిఫ్ఫీన్కు 15వ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆయన మృతి వార్తను కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.