Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్-19 ని నియంత్రించే సొబెరన 02, అబ్దాలా వ్యాక్సిన్ లు
- అబ్దాలా సామర్ధ్యం 92.28 శాతం, సొబెరన 02 సామర్ధ్యం 62 శాతం
- ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 50 శాతం ప్రమాణం కన్నా ఎక్కువే.
- ప్రపంచంలోని కోట్లాది పేదలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యం- క్యూబా నేతలు
ఒక వైపు నుంచి కోవిడ్-19, మరొక వైపు నుండి అమెరికా క్రూర దిగ్బంధనం- ఈ రెండింటినీ దీటుగాఎదుర్కుంటూనే 48 గంటల వ్యవధిలో రెండు అద్భుతాలను క్యూబన్ సైంటిస్టులు ఆవిష్కరిం చారు.మొదటిది సొబెరనా 02.ఫిన్లే ఇన్స్టిట్యూట్లో ని శాస్త్రవేత్తలు ఇతర పరిశోధనా సంస్థల సహకా రం కూడా తీసుకునిఆవిష్కరించిన వ్యాక్సిన్ ఇది.62 శాతం సామర్ధ్యం దీనికి ఉన్నట్టు ప్రయోగ ాలలో నిర్ధారించుకున్నాక,ఒక స్వతంత్ర అధ్యయన బృందం దీనిని ధ్రువీకరించింది.రెండు డోసుల సొబెరన 02 తో బాటు సొబెరన ప్లస్ అనే మరో వ్యాక్సిన్ ను కూ డా కలిపి తీసుకుంటే కొత్తగా తలెత్తు తున్న కరోనా వేరియంట్లను కూడా దీటుగా ఎదుర్కొ నవచ్చునని, అందుకు సంబంధించిన ప్రయోగాల ఫలితాలను కూడా త్వరలో వెల్లడిస్తామనిఫిన్లే ఇన్స్టిట్యూట్ తెలిపింది.
రెండవది: అబ్దాలా. దీనిని క్యూబాలోని సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (సిఐజిబి) శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ప్రయోగా లలో దీని సామర్ధ్యం 92.28 శాతంగా ఉన్నట్టు రుజువైందని వారు ప్రకటించారు. ఐకా లాబొరేటరీస్ దీనిని ఉత్పత్తి చేసి సరఫరా చేస్తుంది. దీనిని మూడు డోసులలో తీసుకోవాలి. క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ దియాజ్ కానెల్ బెర్ముడెజ్ క్యూబన్ శాస్త్రవేత్తలను అభినందించారు. ఆ సందర్భంగా '' మనం సాధిం చిన మేధో సంపత్తి విలువ అది ఎంతమంది ప్రాణాల ను కాపాడిందన్న దానిని బట్టి ఉంటుంది'' అన్న జోస్ మార్టి వ్యాఖ్యలను ఉటంకించారు. కోవిడ్-19 సవాలునే గాక అమెరికా దిగ్బంధనాన్ని కూడా తట్టుకుని ప్రజలకు 48 గంటల వ్యవధిలో రెండు అద్భుతమైన వ్యాక్సిన్లను అందించినందుకు శాస్త్రy ేత్తలను కొనియా డారు. '' మనల్ని వెలివేసిన వారికే తిరిగి మనం మరో రెండు రోజుల్లో రెండు వ్యాక్సిన్ లను కానుకగా ఇచ్చి ఆ వెలిని ఓడిద్దాం'' అని బెర్ము డెజ్ ప్రకటించారు. జూన్ 16 నాటికి 43,28,291 డోసుల సొబెరన 02, అబ్దాలా వ్యాక్సిన్లను క్యూబా ప్రజలకు ప్రభుత్వం అందించింది. ఒక కోటి జనాభా మాత్రమే ఉండి 50 సంవత్సరాలుగా అన్ని రకాల దిగ్బంధనాలనూ తట్టుకుంటూ ఈ సంక్షోభ సమ యంలో సోషలిస్టు క్యూబా సాధించిన అపూర్వ విజ యం ఇది !140 కోట్ల జనాభా ఉండి, ప్రపంచంలోనే అగ్రశ్రేణి వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా ఇటీవల వరకూ ఉన్న మన దేశం మోడీ నాయకత్వంలో చతికిలబడిన తీరుకు, క్యూబా తన ప్రజలకేగాక ప్రపంచంలోని పేదలందరికీ అండగా నిలుస్తున్న తీరుకు ఎంత తేడా !