Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాడ్రిడ్ : యాంటీ వైరస్ సాప్ట్వేర్ సంస్థ మెకాఫీ వ్యవస్థాపకుడు, టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్ జాన్ మెకాఫీ (75) స్పెయిన్లో ఆత్మహత్య చేసుకున్నారు. బార్సిలోనాలోని బ్రియాన్స్ 2లో తనను ఉంచిన జైలులో ఆయన విగతజీవిగా కనిపించారు. ఈ విషయాన్ని జైలు అధికారులు తెలిపారు. పన్ను ఎగవేత ఆరోపణలతో స్పెయిన్ జైలులో ఉన్న ఆయనను అమెరికాకు తరలించేందుకు స్థానిక కోర్టు ఆమోదించిన కొన్ని గంటల్లోనే ఆయన తుదిశ్వాస విడిచారు. మెకాఫీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు, ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. అక్టోబర్ 2020లో ఇస్తాంబుల్ వెళ్లేందుకు బార్సిలోనా విమానాశ్రయానికి వెళ్లిన మెకాఫీని అధికారులు అరెస్టు చేసిన నాటి నుండి స్పెయిన్ జైలులోనే ఉన్నారు. కన్సల్టెన్సీ, క్రిప్టో కరెన్సీల ద్వారా బాగా ఆదాయాన్ని ఆర్జించినప్పటికీ... 2014-18 మధ్య కాలంలో పన్ను రిటర్న్ దాఖలు విషయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. ఈ కేసులో దోషిగా రుజువైతే... 30ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించాల్సి వచ్చేది.