Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అవినీతిని ప్రశ్నిస్తే.. అగ్రరాజ్యమైన అమెరికాలో ఏం జరుగుతుందో జాన్ మెకఫీ మృతే తెలియజేస్తుంది. యాంటీ వైరల్ సృష్టికర్త జాన్ మెకఫీ (75) బుధవారం స్పెయిన్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య జూనైస్ మెకఫీ ఆయన మరికొద్దిరోజుల్లోనే చనిపోతారని ముందే ఊహించినట్లు కొద్దిరోజుల క్రితమే ఆమె ట్వీట్ చేసింది. 'ప్రభుత్వ ఏజెన్సీల్లో ఉన్న అవినీతి గురించి మాట్లాడినందుకు నా భర్తను జైల్లో పెట్టడమే కాకుండా.. చిత్రహింసలకు గురిచేసి.. అతను జైల్లోనే మరణించాలని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అవినీతి గురించి మాట్లాడితే ఏం జరుగుతుందో నా భర్త మృతే ఓ ఉదాహరణ' అంటూ ఫాదర్స్‌డే రోజున జూనైస్ ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే భర్త మృతి ముందే ఊహించిన జూనైస్ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జూనైస్ మెకఫీ ఫాదర్స్‌డే సందర్భంగా జూన్ 20వ తేదీన చేసిన ట్వీట్లో 'హ్యాపీ ఫాదర్స్‌డే. నీవు ఈరోజున జైల్లోనే గడుపుతున్నావు. అవినీతి పరిపాలన సాగుతున్న చోట నీవు నిజాయితీగా ఉండడం వల్లే నీవు ఈరోజు జైల్లో ఉన్నావు. అదే నిన్ను ఇబ్బందుల్లో పడేసింది. అమెరికాలో నీకు న్యాయం జరుగుతుందని నేను భావించడం లేదు' అంటూ జూనైస్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, జూనైస్, జాన్‌లకు 2013లో వివాహమయ్యింది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు.