Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒట్టావా : కెనడాలో మూతపడిన పాఠశాలల్లో వందలాది చిన్నారుల అస్తిపంజరాలు వెలుగుచూడటం గగుర్పాటుకు గురిచేస్తోంది. తాజాగా మరో చోట 600 మంది ఆస్తిపంజరాలు బయటపడ్డాయి. సస్కాట్చువన్్లోని పాతబడిన మారివల్ ఇండియన్ రెసిడెన్షియల్ మైదానంలో గుర్తుతెలియని వందలాది అస్థిపంజరాలను కనుగొన్నట్లు స్వచ్ఛంద సంస్థ కౌవెసెస్స్ ఫస్ట్ నేషన్ వెల్లడించింది. ఈ స్కూల్‌ను రోమన్ కాథలిక్ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నడిచినట్లు అధికారులు చెబుతున్నారు. రాడార్లు ఆధారంగా గత నెలలో మూత పడిన పలు పాఠశాలల్లో 751 మంది అస్థిపంజరాలను వెలికితీయగా.. తాజాగా మరో 600 మంది అస్థిపంజరాలను గుర్తించామని ఫస్ట్ నేషన్ చీఫ్ కార్డ్మస్ డెల్మోర్ తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ సోవర్జిన్ ఇండియన్ నేషన్స్ చీఫ్ బాబీ కెమరాన్ మాట్లాడుతూ... గత నెల బ్రిటిష్ కొలంబియాలోని మూసివున్న కామలూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 215 అస్థి పంజరాలను వెలికితీసినట్లు చెప్పారు. రాడార్ ఆధారంగా సమాచారం వెలుగులోకి రావడంతో మూసివున్న పాఠశాలలపై అధికారులు దృష్టిసారించారు. కాగా, అనేక సంవత్సరాలుగా 1,50,000 మందికి పైగా చిన్నారులు కనిపించకుండా పోయారని 2015లో కెనడాలోని ద ట్రూత్ అండ్ రీ కాన్సిలేషన్ కమిషన్ పేర్కొంది. కాగా, ఇంకా వెలికితీత చేపడుతూనే ఉన్నామని అన్నారు. అన్ని మృతదేహాలు వెలికితీసేంత వరకు తమ పని కొనసాగిస్తామని వారు చెబుతున్నారు.