Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్ : ఈ ఏడాది చైనా ఆర్థిక వృద్ధి రేటును 8.1శాతం నుండి 8.5శాతానికి ప్రపంచ బ్యాంక్ పెంచింది. పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి వ్యాక్సినేషన్ క్రమంలో పురోగతి అవసరమని పేర్కొంది. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక చైనాకు సానుకూల సంకేతాలను అందచేసింది. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న మొదటి ప్రధాన ఆర్థిక వ్యవస్థ చైనానే. కరోనాకు ముందున్న స్థాయిలో ఫ్యాక్టరీ, వినిమయ కార్యకలాపాలు పుంజుకున్నాయి. వైరస్ కొత్త వేరియంట్లు రాకుండా చెక్ పెట్టేందుకు కొన్ని ప్రాంతాల్లో ప్రయాణ ఆంక్షలను అధికారులు తిరిగి విధిస్తున్నా మొత్తానికి అన్ని చోట్లా సాధారణ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి.